నిజామాబాద్ క్రైం,బతుకమ్మ : తన ఆటోలో పాటలు వింటూ ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మూడో టౌన్ పరిధిలోని రైతు బజార్ వద్ద గల ఒక వైన్స్ ఎదురుగా ఆటోలో పాటలు వింటూ కూర్చున్నాడు. సుమారు రెండు మూడు గంటల నుంచి కదలిక లేక పోవడంతో స్థానికుల 108 సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది పరిశీలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

