- విద్యార్థులు చదువుతో పాటు సమాజాన్ని చదవాలి
- ఎస్ఆర్ విద్యాసంస్థల నిజామాబాద్ జోనల్ ఇన్చార్జీ శ్రీకాంత్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థులు చదువులతో పాటు సమాజాన్ని చదవాలని అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని మోడల్ పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులకు పరీక్షల పట్ల ఒక అవగాహన వస్తుందని అదే విధంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయన ఎస్ఆర్ విద్యాసంస్థల నిజామాబాద్ జోనల్ ఇన్చార్జ్ శ్రీకాంత్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కౌన్సిల్ అధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 సెంటర్ 900 మంది విద్యార్థులు కు నిర్వహించిన మోడల్ ఎప్ సెట్ – నీట్ పరీక్ష పత్రాన్ని కంటేశ్వర్ లోని ఎస్ఆర్ (ఎంఎస్ఆర్) క్యాంపస్ లో విద్యాసంస్థల నిజామాబాద్ జోనల్ ఇంచార్జ్ శ్రీకాంత్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే ఎఫ్ సెట్ పరీక్షలో విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మోడల్ ఎఫ్ సెట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నిర్వహించే పరీక్షలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు సమయం వృధా కాకుండా పరీక్ష ఎలా రాయాలా అనేది కూడా చాలా ఉపయోగమని వీటన్నిటికైనా ఒక అవగాహన కల్పించేందుకు ఏఐఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన మోడల్ ఎంసెట్ ఎంతో ఉపయోగం అని అందుకు ఏఐఎస్ఎఫ్ జిల్లా జిల్లా నాయకత్వం అయినా అభినందించారు. ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎఫ్సెట్ ఎగ్జాం మనోధైర్యం కోల్పోకుండా ధైర్యం తోటి రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజలి, రఘురాం, ఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి,ఏఐఎస్ఎఫ్ నాయకులు కుషాల్ ,వంశీ ,కార్తీక్ ,శిరీష ,నరేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
