24 C
Hyderabad
Sunday, August 2, 2026

హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ :  కుటుంబ కలహాల వల్ల అన్నను హాత్య చేసి చంపిన తమ్ముడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాలు ప్రకారం సంవత్సరం క్రితం పోతంగల్ మండల కేంద్రానికి చెందిన దిమ్మెలవార్ గోవింద్( 55 ) కులం:మంగలి అనే వ్యక్తిని కుటుంబ కలహాల  కారణంగా అతని స్వంత  తమ్ముడు  దిమ్మెలవార్ విట్టల్ ( 45   అనే వ్యక్తి హత్య చేయగా అతని అప్పటి దర్యాప్తు అధికారి సిఐ జయేశ్ రెడ్డి  అరెస్టు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో గురువారం బోధన్ కోర్టు అడిషనల్ జడ్జ్  రవికుమార్  నిందితుడు దిమ్మెలవార్ విట్టల్ కు జీవిత ఖైదు జైలు శిక్ష తో పాటు వేయి రూపాయలు జరిమానా విధించడం జరిగిందనీ ఆయన తెలిపారు.ఇట్టి కేసులో బాధితుల తరఫున శ్యామ్  రావు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ  వాదనలు వినిపించారనీ ఆయన అన్నారు.

More articles

Latest article