29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్‌లో ఫైనాన్స్ సంస్థలపై మెరుపు దాడులు

Must read

📰 Generate e-Paper Clip

– వడ్డీ వ్యాపారులు పరార్

బోధన్, బతుకమ్మ  : బోధన్ పట్టణంలో వడ్డీ వ్యాపారుల సంస్థలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎనిమిది ఫైనాన్స్ సంస్థలపై తనిఖీలు జరిగాయి. అధిక వడ్డీ వసూలు, లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫైనాన్స్ లపై అధికారులు దృష్టి సారించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టారు. తనిఖీలకు భయపడి కొన్ని ఫైనాన్స్ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయగా, వడ్డీ వ్యాపారులు పరారయ్యారు. అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

More articles

Latest article