పోచారం శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

0 4,826

రుద్రూర్, బతుకమ్మ  :  రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఈసందర్భంగా గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారం, తోట సంగయ్యలు మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పై శనీశ్వరుడని అనుచిత వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డిది సరైన పద్ధతి కాదన్నారు. మరోసారి శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు పత్తి రాము, నెరుగంటి బాలరాజు, పట్టేపు రాములు, లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, మొద్దుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.