25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మరో 165 టీచర్లకు స్పౌజ్ బదిలీలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ(భార్యాభర్తలు) కింద ప్రభుత్వం బుధవరం మరో 165 మంది ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. జీఓ 317 ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసి గత జనవరిలో మొత్తం 834 మంది ఉపాధ్యాయులను కోరుకున్న జిల్లాలకు బదిలీ చేసి భార్యాభర్తలను ఒక జిల్లాకు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని తప్పిదాలు, సాంకేతిక కారణాల వల్ల

Spouse transfers for another 165 teachers

మరికొంత మంది మిగిలిపోయారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా మరో 165 మంది బదిలీలకు అనుమతి ఇస్తూ  జీఓ జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు బదిలీల జాబితాను డీఈఓలకు పంపించారు. ఏప్రిల్ 22న కు రిలీవ్ అయి 23 న వారికి కేటాయించిన జిల్లాలోని పాఠశాలలో జాయిన్ కావాలి.

Spouse transfers for another 165 teachers

More articles

Latest article