నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ వర్సిటీ కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కే.రంజిత కు డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగం పరిశోధక విద్యార్థికే.రంజిత ప్రస్తుతం జి జి కాలేజీ, కామర్స్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పరిశోధక విద్యార్థి కే.రంజిత కామర్స్ సీనియర్ ఆచార్యులు. యం. యాదగిరి పర్యవేక్షణలో ” అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్- ఏ స్టడీ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన జరిపారు. రంజిత సిద్ధాంత గ్రంథం పై బుధవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ ఆచార్య బద్ధుద్దీన్ అహ్మద్, మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుండి హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథం పై విస్తృతమైన, సమగ్రమైన ప్రశ్నలు లేవనెత్తినారు. ఎక్సటర్నల్ ఎగ్జామినర్ అడిగిన అన్ని ప్రశ్నలకు పరిశోధకురాలు సాపేక్షమైన ఉదాహరణలతో సమాధానాలు ఇవ్వడంతో ఎక్సటర్నల్ ఎగ్జామినర్ పరిశోధన గ్రంథం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ పరిశోధనలో మునిసిపాలిటీలో ఉపయోగిస్తున్న అకౌంటింగ్ విధానాలను, కూలంకుషంగా అధ్యయనం చేశారు. డిజిటలైజేషన్ ఆన్లైన్ వలన వినియోగదారునికి కలిగే ప్రయోజనాలను సమగ్రంగా అధ్యయనం చేసి ఆన్లైన్ వల్ల ఉన్న బహుళ ప్రయోజనాలను గుర్తించారు. పరిశోధకులు కే. రంజిత అందించిన జవాబులకు బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ఆచార్య బద్ధుద్దీన్ అహ్మద్ సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ డిగ్రీ ప్రదానానికి ఆమోదం తెలిపారు. తన పరిశోధనకు సహకరించిన పర్యవేక్షకులు తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య యం యాదగిరి కి, డీన్ ఆచార్య రాంబాబు గోపిశెట్టి కి, డాక్టర్ శ్రీనివాస్ కి, తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు, ఎంతో రుణపడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
