24 C
Hyderabad
Sunday, August 2, 2026

తన ఇంటి చుట్టూ తిప్పుకున్న చరిత్ర ప్రశాంత్ రెడ్డిది

Must read

📰 Generate e-Paper Clip

  • బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్

 

బతుకమ్మ,మోర్తాడ్: ప్రజా ప్రభుత్వంలో ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారని బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రజా నిలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజాయితీగా కష్టపడి పనిచేసి ప్రజా సమస్యలు తీరుస్తున్నారని పేర్కొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ గౌరవం ఇచ్చిందని దాన్ని ఆయన కాపాడుకోవడం లేదని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా మళ్ళీ అదే పాత తరహా ఆహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.  కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్, సీఎంఆర్ఎఫ్ సంతకాల కోసం బాల్కొండ నియోజకవర్గ ప్రజలను తన ఇంటి చుట్టూ తిప్పుకున్న చరిత్ర ప్రశాంత్ రెడ్డికి ఉందని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చే పథకాలలో కూడ కమిషన్లు తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. ప్రజాపాలనలో ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందుతున్నారని బ్రోకర్ వ్యవస్థ పూర్తిగా అంతరించిపోయిందని అన్నారు. చెక్కుల గడువు ముగిసిపోతుంది లబ్ధిదారులకు చెక్కులు పెంచాలి అని హెచ్చరించినా ఎమ్మెల్యే అధికార దర్పాన్ని చూపించడం వల్ల నియోజకవర్గానికి మంజూరైన 513 కల్యాణ లక్ష్మి చెక్కులు చెక్కుల గడువు ముగిసిపోతే ప్రభుత్వానితో మాట్లాడి వాటిని రెన్యువల్ చేయించడం జరిగిందని ఆయన అన్నారు.  ఎమ్మెల్యే నేను చెక్కుల పంపిణీని బహిష్కరిస్తున్నట్లు ఒకసారి కలెక్టర్ కు ఉత్తరం రాస్తారని, చెక్కుల గడువు ముగిసి పోయాక పంచాయతీ సెక్రటరీల ద్వారా చెక్కులు పంచాలని ఆర్డీవోకు ఉత్తరం రాస్తారని ఆయన అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని అదేదో పంచాయతీ సెక్రటరీల ద్వారా పంచాలని కలెక్టర్ కు ఉత్తరం రాస్తే ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుని అమలుపరిచేవారు కదా అని అన్నారు.  నియోజకవర్గంలో బీఆర్ఎస్ అవినీతిని కూకటివేల్లతో పెకిలించి వేసామని ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా పనిచేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ఆరువేల రూపాయలు ఉన్న ఇసుక రేటుని ప్రభుత్వంతో మాట్లాడి రేవంత్ రెడ్డి  ఆలోచన మేరకు రెండు కొత్త ప్రభుత్వ పాయింట్ లను ఏర్పాటు చేయించి రూ. 2,300 నుండి 3300 మధ్యలోనే ఇసుకను అందించి సామాన్యులకు అండగా ఉంటున్నామని అన్నారు. వీలైనంత ప్రభుత్వ ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి ఇసుక రేటును రాబోయే రోజుల్లో మరింత తగ్గించే ప్రయత్నం చేస్తామని సామాన్యుల ఇల్లు కట్టుకోవాలనుకునే కళకు అండగా ఉంటామని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సొంత మండలం అని చెప్పుకునే వేల్పూర్ మండలంలో కూడా దోపిడీ చేసి మోసం చేశారని అన్నారు. రానున్న రోజుల్లో వేల్పూర్ మండలంలో ప్రభుత్వ క్వారీలకు అనుమతులు ఇప్పించి వేల్పూర్, అమీనాపూర్,పడగల్ అంక్సాపూర్,  గ్రామాలకు 2500 రూపాయల లోపు ఇసుకను అందిస్తామని అన్నారు. గతంలో ఇక్కడ కూడా 6000 రూపాయల పైచిలుకు ధరకు ఇసుకను విక్రయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేల్పూర్ మండలాన్ని దోపిడీ చేశారని అన్నారు. నిజాయితీగా నిబద్ధతతో క్రమశిక్షణతో ప్రజాపాలన నడుస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి విమర్శించడం తప్ప ఏది తెలియదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article