27.2 C
Hyderabad

వడగండ్ల వానలతో తీవ్ర నష్టం

Must read

📰 Generate e-Paper Clip

  • అయోమయంలో కుటుంబీకులు
  • ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

 

ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండలంలోని కేకే తండ గ్రామపంచాయతీ పరిధిలో గల భూక్య మోహన్ కు చెందిన నివాసపు ఇల్లు సోమవారం తెల్లవారుజామున భారీ ఈదురు గాలులకు నేలమట్టం అయిందని బాధిత కుటుంబీకులు రోధిస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని తమకు నూతన గృహాన్ని కేటాయించాలని వేడుకొన్నారు. భూక్య మోహన్ తన ఇల్లు కూలిపోవడంతో పక్కనే పశువులు ఉండే గుడిసెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. తక్షణమే ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లును కేటాయించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. బుకే మోహన్ కు భార్యతో పాటు పిల్లలు కూడా ఉన్నారు.

More articles

Latest article