27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గరీబోళ్ల బిడ్డ నిన్ను మరువది ఈ గడ్డ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి అంటరాని కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గరీబోళ్ల బిడ్డ నిన్ను మరువది ఈ గడ్డ అంటూ వాడవాడల నినాదాలు వినిపించాయి. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామ గ్రామాల్లో ఘనంగా ర్యాలీలు నిర్వహిస్తూ, అన్నదానాలు చేశారు. బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్, మెండోరా, బాల్కొండ, వేల్పూర్, కమ్మర్ పల్లీ,  ముప్కల్, ఏర్గట్ల, భీమ్ గల్ మండలాల్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా పాటలు పాడుతూ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.

This land will not forget you, child of the poor.

More articles

Latest article