25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ: బీఆర్ఎస్ ప్రభుత్వం ను ప్రజలు ఏ కారణాల చేత పక్కన బెట్టారో, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ను ప్రజలు అదే కారణాలతో పక్కన పెట్టానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన బస్తీ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టణంలో సమస్యలను తెలుసుకొని సమస్యలను ఉద్దేశించి మాట్లాడారు. పట్టణంలోని రాతం చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పి మాజీ మంత్రి రూ. 6 కోట్ల చిల్లర నిధులు మంజూరు చేయించి, పనులు నాసిరకం పనులు చేసి నిధులు మొత్తం కాజేశారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీయర్ఎస్ కు చెందిన బడా బాబులు కొందరు ఈ రాతం చెరువును కబ్జా చేసి ప్లాట్లు పెట్టి అమ్మి సొమ్ము చేసుకొని వెళ్లి పోయారని, ఆ బడా బాబులు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారని అన్నారు. ఈ బడా బాబులు చేసిన పని వల్ల కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన అమాయకులు బలివుతున్నారని అన్నారు. ఆలా బలి అయిన అమాయక బాధితులకు ఇబ్బందులు కలిగివ్వ కుండా కబ్జా కోరులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భీంగల్ లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెగ పనులు చేశామని చెప్పుకుంటూ ఇంకా భీమ్ గల్ లో తిరుగుతున్నాడని, ఆర్టీసీ చైర్మన్ ను వెంటబెట్టుకొని వచ్చి హడావిడిగా బస్ డిపో ఓపెన్ చేసి,  మూడు రోజుల ముచ్చట చేసారని ఆరోపించారు. బస్ డిపో మూత పడింది,  వేజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అదే విధంగా  వంద పడకల ఆస్పత్రి ఆగిపోయిందని అన్నారు,ఇప్పుడు బీయర్ఎస్ వారు ఏ అభివృద్ధి పని చేసే పరిస్థితిలో లేరని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్లు నాలుగు గ్రూపులతోనే సరిపోయిందన్నారు.  ప్రజల సమస్యల మీద పనిచేసేందుకు  గెలిచిన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని,  అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితుల్లో లేరని ఏద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం ప్రజలకు మేలు చేస్తామన్నారు.

భీమ్ గల్ కు ఇప్పటివరకు పోస్ట్ ఆఫీస్ భవనం లేనందున పోస్ట్ ఆఫీస్ భవనం కు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎం. పీ అర్వింద్ నిధులు తీసుకువచ్చరని తెలియజేస్తూ,భవన నిర్మాణం కు వెంటనే స్థలం ఇప్పించాలని అధికారులకు తెలిపారు.రానున్న రోజులలో బిజెపి కీలక పాత్ర పోషిస్తుందని ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతామని, ప్రజా సంక్షేమ పథకాల విషయంలో అందరికీ అందేలా పోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని, భీమ్ గల్ లో జరిగిన అవినీతి చిట్టా బాగోతం మొత్తం తన దగ్గర ఉందని,ఆ చిట్టా బాగోతం ఎపిసోడ్లవారీగా ఈ నెల చివరలోపు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆధారాలతో సహా ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పుతామన్నారు.  కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పేందుకు రెడీగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ ములుగే మహిపాల్,టౌన్ ప్రెసిడెంట్ కనికరం మధు,మాజీ ఎంపిటిసి ఆరే రవీందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, పట్టణ కిషన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్, ఎస్టి మోర్చా మండల ఉపాధ్యక్షులు రమావతు వెంకటేష్, భీంగల్ సర్వసమాజ్ కమిటీ కోశాధికారి కాపు కుమ్మరి హరీష్,సీనియర్ నాయకులు సంధ్య రాజు,పీరీ గంగాధర్, చిన్ని నరసయ్య, ముచ్చుకూరు ప్రసాద్, జై గురు ప్రసాద్, గోపారం సురేందర్, తోపారం నరేందర్,నరేందర్ గౌడ్ నవీన్, పుండరీకం, తక్కురి అంజయ్య,కంఠం శేఖర్,నామాల వెంకటేష్,దర్శన్, పట్టణ, మండల శక్తి కేంద్ర ఇన్చార్జిలు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article