26.2 C
Hyderabad
Monday, August 3, 2026

21 ప్యాకేజీ పనులను సత్వరమే పూర్తి చేయండి     

Must read

📰 Generate e-Paper Clip

  • న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  21 ప్యాకేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో ఆదివారం విలేకరుల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో అనేక రైతాంగా పోరాటాల ఫలితంగా గోదావరి నదిపై అల్లి సాగర్ గుత్ప ఎత్తిపోతలు సాధించుకున్నామని తెలిపారు. దీనితోపాటు మంచిప ప్రాజెక్టు ద్వారా గాడ్కోల్ సెగ్మెంట్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 5,6 మండలాల్లో 84 వేల ఎకరాలకు సాగు నీరు అందించెందుకుగాను మంచిప్ప ప్రాజెక్టును నిర్మిస్తున్నారనితెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు గత 2 సంవత్సరాలుగా  నిలిపేసారని 21 ప్రాజెక్టు పనులకు  తగిన నిధులు కేటాయించి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన ఉద్యమం అంతా నీళ్లు, నిధులు, నియమాల కొరకు జరిగిందని ఆ ఉద్యమం నుంచి వచ్చిన వారే ఈ ప్రాంత శాసనసభ్యులు  భూపతి రెడ్డిని అన్నారు. ఈ 21 ప్యాకేజ్ పనులను వెంటనే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం తగిన విధంగా స్పందించేందుకు వారు ప్రయత్నించాలని కోరారు. మంచిప్ప నుండి గడ్కోల్ వరకు ఈ పరిధిలో 80 గ్రామాలలోని 84 వేల ఎకరాలకు సాగునీరు అందెందుకు  ఉపయోగపడుతుందని తెలిపారు. దీనితో పాటు ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపినట్లయితే పశువులకు దాహార్తి తీర్చటంతోపాటు పాటు భూగర్భ జలాలు పెరిగి బోర్లలో  నీటి నిల్వలు  పెరుగుతాయని అన్నారు. మొన్న ఈ రభి సీజన్ పంటలు చివరి దశలో నీళ్లు అందక చేతుకొచ్చిన వరి, మొక్క జొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 60 శాతం పనులు జరిగాయని మిగతా పనులకు  నిధులు కేటాయించి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితుల సమస్యలను  పరిష్కరించేందుకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి వారితో మాట్లాడాలని, నిర్వాసితుల సమస్యలను 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి బదులు భూములు, ఇండ్లు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ ప్రాజెక్టు పనులు నిలిచి రెండు సంవత్సరాలు అవుతుందని ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేసినట్లయితే ఈ ప్రాంత రైతుల చే ఆందోళన చేపట్ట వలసి వస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, శివకుమార్ పాల్గొన్నారు.

More articles

Latest article