28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కళాకారులు, రచయితలపై దాడులను ప్రతిఘటించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజా కళాకారులు, రచయితలు, మేధావులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని అరుణోదయ సాంస్కృతి సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుడ్డు  గంగాధర్ అన్నారు.  మాక్లూర్ మండలం ఓడాట్పల్లి గ్రామంలో కానూరి వెంకటేశ్వర్ తాత పదో వర్ధంతిని అరుణోదయ సాంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా దుడ్డు  గంగాధర్ మాట్లాడారు. అరుణోదయ వ్యవస్థాపకుడు కానూరి తాత జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశాడని గుర్తు చేశారు అరుణోదయ   సమాఖ్య అభివృద్ధి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడన్నారు. కార్యక్రమంలో మహేష్, నవీన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article