రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన చింతల రాజు – చింతల రేణుక దంపంతుల కూతురు మహాన్విత(2) క్యాన్సర్ వ్యాధితో మూడు నెలలుగా బాధపడుతోంది. స్థానిక బీజేపీ నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ రూ. 5,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆదివారం బీజేపీ నాయకులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే కోనేరు ట్రస్ట్ ద్వారా తన నెలవారీ టాబ్లెట్స్ కు సహాయం అందిస్తానని వారి కుటుంబానికి శశాంక్ భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, మండల సీనియర్ నాయకులు కటిక రామ్ రాజ్, మండల ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
