27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సెలవు రోజుల్లో మున్సిపల్ సిబ్బందితో పని

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సెలవు రోజుల్లో కూడా మున్సిపల్ సిబ్బందితో అధికారులు పని చేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూనియన్ నాయకులు రాజ్ గగన్ మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతినెల రెండవ శనివారం, ఆదివారం అదేవిధంగా మన దేశ  మహానీయుల జయంతులకు సెలవులు ఇస్తారన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండో శనివారాలు ఆదివారాల్లో, డా.బి.ఆర్.అంబేద్కర్ మహనీయుల జయంతి కూడా కార్మికులతోని పనిచేయించడం సరైన పద్ధతి కాదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్మిక చట్టాలను వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా లేబర్ చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని వాపోయారు. వెంటనే సెలవులను ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నీలగిరి రాజు మాదిగ, జె.ఏ.సి నాయకులు మల్లాని శివ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు ఘగన్, తదితరులు పాల్గొన్నారు.

Working with municipal staff during holidays

More articles

Latest article