23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం సందర్శన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలోని  జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన విద్యార్థులు హైదరాబాదులోని  భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహాసముద్ర  సమాచార సేవా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్  డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో   ఏ విధమైన సేవలను అందిస్తుందో విద్యార్థులకు ఉపగ్రహాల ద్వారా గ్రహించిన ఛాయా చిత్ర సమాచారాన్ని  ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, సముద్రంలో జరిగే నిరంతర మార్పులను ఏ విధంగా జరుగుతున్నాయో వివరించారు. ఈ కేంద్రం ద్వారా 24 దేశాలకు భూకంప, సునామీ యొక్క  తీవ్రతను  తెలియజేయడం జరుగుతుందని, హైదరాబాద్   సురక్షితమైన ప్రాంతం కావడం వల్ల  వి కేంద్రాన్ని ఇక్కడ స్థాపించారని చెప్పారు.  భూకంపాలు, మరియు సునామి వంటి ఉపద్రవాలు   సంభవించినప్పుడు  దాని ద్వారా నష్టం జరగకుండా ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేస్తారో  వివరించారు. అంతేకాకుండా  తీర ప్రాంతంలోని చేపల జాలర్లకు ఏ ప్రాంతంలో చేపలు లభిస్తాయో  వారి ఫోన్లకు  సమాచారాన్ని అందిస్తారు. వర్షపాతం, తుఫాను సంభవించినప్పుడు  దాని తీవ్రతను  ప్రభుత్వానికి మరియు ప్రజలకు  తెలియజేయడం జరుగుతుంది  రిమోట్ సెన్సింగ్ మరియు జియో ఇన్ఫర్మేటిక్స్  టెక్నాలజీ ద్వారా ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో వివరించారు . విద్యార్థులకు తరంగ్ అని సూపర్ కంప్యూటర్ ఏ విధంగా పనిచేస్తుందో వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఆర్ఎస్ మహేంద్ర, సూర్యనారాయణ, ఉదయ భాస్కర్, ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో   సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్,   హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ బి సబిత,  డాక్టర్. కవితా తోరణ, డాక్టర్ టి ప్రతిజ్ఞ, డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా  జియో ఇన్ఫర్మేటిక్స్ విద్యార్థులు  పాల్గొన్నారు.

Visit to India's National Ocean Information Service Centre

More articles

Latest article