27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిద్దరిని  గురువారం బోధన్ కోర్టులో హాజరు పరచగా, రుద్రూర్ గ్రామానికి చెందిన అక్కని వార్ లక్ష్మణ్, తండ్రి పేరు మారుతి 500 రూపాయల జరిమానా, రెండు రోజులు జైలు శిక్ష, అలాగే రాయకూర్ గ్రామానికి చెందిన పేదాసు నగేష్, తండ్రి పేరు అబ్బయ్యకి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1000 రూపాయల జరిమానా, ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్  శేష తల్ప సాయి తీర్పు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపర చర్యలు తీసుకుంటామని రుద్రూర్ ఎస్సై పి.సాయన్న పేర్కొన్నారు.

More articles

Latest article