24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ…

నిజామాబాద్, బతుకమ్మ :    కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర ధరల పెంపును నిరసిస్తూ.. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ లో నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 400 ఉన్న గ్యాస్ ధరను రూ.1000 దాటించిందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలే కాకుండా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను 50 శాతం పైగా తగ్గించాలని, నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, టీయూసీఐ జిల్లా నాయకుడు విఠల్, గంగాధర్, పీడీఎస్ యూ జిల్లా నాయకులు మహిపాల్ , పీఓడబ్ల్యు నాయకులు నర్సక్క, సునంద, అమూల్య, లలిత, సరస్వతి, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article