27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నర్సు అనుమానాస్పద మృతి?

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్ణంలో ప్రైవేటు హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. మమత బీర్కుర్ మండలం బరంగేడి గ్రామస్తురాలు. బాన్సువాడ పట్టణంలోని ఓ గదిలో అద్దెకు ఉంటూ నర్సుగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఓ యువకుడు మమతను హాస్పిటల్ కు తీసుకువచ్చి వదిలేసి వెళ్లగా పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. సదరు యువకుడు యువతి మధ్య ప్రేమ వ్యవహరం ఉందని ప్రచారం జరుగుతుంది. మమత మృతి చెందిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. మమతను హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆరోపించారు. మమతను చంపిన నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ బాన్సువాడ పోలీసు స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు కల్పించుకుని విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మమత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

More articles

Latest article