24 C
Hyderabad
Sunday, August 2, 2026

 పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్

మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. సుంకెట్ గ్రామ శివారులోని ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.12,170 నగదు, 9 సెల్  ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మోర్తాడ్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పట్టుబడిన వారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తెలిసింది. అందులో మాజీ ఉప సర్పంచ్ తో పాటు మరికొందరు పట్టుబడిన వారిలో  ఉన్నారు.

More articles

Latest article