30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

శామీర్ పేట్ మండలం రాజీవ్ రహదారిపై ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని  శామీర్ పేట్ మండలం తుర్కపల్లి, లాల్ గాడి మలక్ పేట్ శివారులోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సఫారీ కారు మితిమీరిన వేగంతో  డివైడర్ దాటి అవతలి వైపు  హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం ను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులను సిద్దిపేట జిల్లా వర్గల్ మండలానికి చెందిన రాజు, మేడ్చల్ మండలం మురహరిపల్లి కి చెందిన శ్రవణ్ గా గుర్తించారు.  ఈ మేరకు జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

More articles

Latest article