నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో స్పెషల్ బ్రాంచ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ, హెచ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. గతంలో ఒకటి, రెండవ టౌన్ ఎస్బీ ఏఎస్ఐగా విధులు నిర్వహించిన లింగారావును నాలుగో టౌన్ కు బదిలీ చేశారు. నాలుగు, ఐదు టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ముత్తెన్న ను ఒకటవ టౌన్ కు బదిలీ చేశారు. మూడు, ఆరో టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గంగాధర్ గౌడ్ ను ఆరో టౌన్ పరిధికి మాత్రమే బదిలీ చేశారు. నిజామాబాద్ రూరల్, మోపాల్ పరిధిలో విధులు నిర్వహించిన పి.సాయిలును నందిపేట్, ఆలూర్ కు బదిలీ చేశారు. డిచ్పల్లి పరిధిలో ఉన్న సురేందర్ రెడ్డిని మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయికి బదిలీ చేశారు. ధర్పల్లి సర్కిల్ పరిధిలో పని చేస్తున్న వసంత్ ను డిచ్పల్లి, సిరికొండకు బదిలీ చేశారు. భీంగల్ సర్కిల్ లో ఉన్న రమేష్ ను కమ్మర్ పల్లి, ఏర్గట్ల, భీంగల్ కు బదిలీ చేశారు. మోర్తాడ్, ఏర్గట్లలో పని చేస్తున్న మనోజ్ ను ముప్కాల్, మెండోరా, మోర్తాడ్ కు బదిలీ చేశారు. ఆర్మూర్ రూరల్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న రతన్ సింగ్ ను బాల్కొండ, జక్రాన్ పల్లి, వేల్పూర్ కు బదిలీ చేశారు. ఆర్మూర్ టౌన్ పరిధిలో పనిచేస్తున్న అన్వర్ ను నిజామాబాద్ టౌన్2, టౌన్ 5కు బదిలీ చేశారు. మాక్లూర్, నందిపేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని నిజామాబాద్ రూరల్, టౌన్3కు, నవీపేట్, ఎడపల్లి, రెంజల్ పరిధిలో ఉన్న కాశీనాథ్ ను రుద్రూర్ సర్కిల్ పరిధికి బదిలీ చేశారు. రుద్రూర్ సర్కిల్ పరిధిలో ఉన్నశ్రీనివాస్ ను రెంజల్, ఎడపల్లికి బదిలీ చేశారు. వేకెంట్ లిస్టులో ఉన్న రాజేశ్వర్ ను నవీపేట్, మాక్లూర్ కు , గోపిని ఆర్మూర్ రూరల్, టౌన్ కుబదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
