- పత్తాలాడిస్తున్న ఒకప్పటి పోలిటికల్, పోలీస్, బిల్డర్ లు
- పదులు సంఖ్యలో కేసులు.. బైండోవర్ లు చేస్తామంటున్నబెదరరు
- దాడులు జరిగితే అడ్డాలు మారుస్తున్నారు గాని పత్తాలాట మానని వైనం
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పత్తలాట జోరుగా సాగుతుంది. అటు ఉత్తర భారతం, ఇటు మహరాష్ట్ర… పొరుగున ఉన్న ఆంధ్ర నుంచి వచ్చి ఉమ్మడి జిల్లాలో తిష్టవేసిన జూదం(పత్తాలాట) దశాబ్ధాలుగా సాగుతుంది. ఒకప్పుడు దీపావళి పండగ నాడు మాత్రమే పత్తాలాడే సాంప్రదాయం ఉండగా అది ఇప్పుడు 356 రోజులు అడే కల్చర్ గా మారింది. సంక్రాంతి సరదా ఆటగా ప్రవేశించిన తరువాత పత్తాలాటకు పట్టా పగ్గాలు లేకుండా పోయాయి. ఒకప్పుడు కేవలం టైం పాస్ గా ప్రారంభమైన పేకాట ఇప్పుడు అడకుండా ఉండలేని వ్యసనంగా మారింది. జిల్లాలో పత్తాలాడే పేకాట రాయుళ్లు రొడ్డున పడుతుంటే ఆర్గనైజర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. వారు ఒకప్పుడు పత్తాలాటకు వ్యసన పరులే కాని దానిని ఆదాయ వనరుగా మార్చుకుని పత్తాలాటను పెంచి పోసిస్తున్నారు. వారు కుడా పూర్వాశ్రమంలో లబ్ధ ప్రతిష్టులు ( వివిధ రంగాలలో స్థిరపడిన వారు) కావడంతో పత్తాలాటలోనే పోగొట్టుకున్న చోటనే సంపాదించాలని ప్లంటర్ లను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పత్తాలాడిస్తున్నారు. వారికి పోలీస్ శాఖలో సంబంధాలతో పాటు పత్తాలాటలో దొరికిన తరువాత కుదిరిన దోస్తానాతో వారు రెచ్చిపోతున్నారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు ఉండగా వారిని బైండోవర్ చేస్తామన్న బెదరకుండా పత్తాలాట అడ్డాలను మారుస్తు మూడు పువ్వులు ఆరుకాయాలుగా పేకాట ఆట నిర్వహణలో తలమునకలయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో పత్తాలాడిస్తున్నవారంతా వివిధ రంగాలలో నిష్ణాతులు ఉన్నారు. వారు పోలిటికల్, పోలీస్, బిల్డర్ లు గా పనిచేసిన వారు ఉండటంతో వారు పోలీస్ అధికారులతో అంటకాగి పత్తాలాడిస్తున్నారు. గతంలో పేకాట విచ్చలవిడిగా ఉండగా క్లబ్ లలో పేకాట ఆడగా అప్పటి ప్రభుత్వం దానిని నిషేదించిన విషయం తెలిసిందే. దానితో పొరుగున ఉన్న మహరాష్ట్రలో పేకాట క్లబ్ లు నిర్వహించిన ఘనత ఇందూర్ జిల్లాకు దక్కించారు మాజీలు. మొన్నటి వరకు గోవాకు ట్రిప్ లలో తీసుకువెళ్లిన వారు ఇప్పుడు గల్ఫ్, మలేషియా, సింగపూర్, థాయ్ లాండ్ వరకు తీసుకువెళ్లి పేకాట అడిస్తున్నారు. నిజామాబాద్ లో గతంలో స్టార్ హోటల్ లను అడ్డాగా పత్తాలాడించిన ఘనులు కొత్త హోటళ్లను వదలడం లేదు. లాడ్జీలకు పరిమితమైన పత్తాలాటా నక్షత్రాల హోటళ్లలో పత్తాలాటతోనే ఆదాయ వనరుగా మారిందంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం ఫాం హౌజ్ లు పత్తాలాటకు కేంద్రాలుగా మారయనేది పోలీసుల దాడులతో బట్టబయలైంది. గతంలో కార్ లలో పంటర్ లను తరలించి వారి వద్ధ నుంచి కేటీల రూపంలో డబ్బులు దండుకునే స్థాయిని దాటినుంచి గేమ్ ప్లేకు టార్గేట్ గా డబ్బులు కలిగిన వారిని తీసుకువచ్చి పత్తాలాడిస్తున్న స్థాయికి జూదంను తీసుకువెళ్లారు ఆ ఘనులు… కేవలం పత్తాలాట ద్వారనే నిత్యం లక్షల రూపాయలు ఆదాయాన్ని అర్జిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో పత్తాలాట అడిస్తున్నవారిలో నిజామాబాద్ రూరల్ మండలంలో జడ్పిటిసిగా పనిచేసిన మహిళ లీడర్ భర్త ఒకరు, మాక్లూర్ మండలం మాజీ జడ్పిటిసి భర్త ఉన్నారు. ఘన చరిత్ర కలిగిన పురుషోత్తములు ఒక్కరు స్టార్ హోటళ్లలో పేకాట ఆడించి ఇప్పుడు గోవా టు గల్ఫ్ దేశాలకు తరలించుటలో బీజిగా ఉన్నారు. నిజామాబాద్ పట్టణంతో పాటు రూరల్ మండలంలో పేకాట ఆడించిన రెడ్డి లీడర్ ఇప్పుడు తన మకాంను బోధన్ చుట్టు పక్కల ప్రాంతాలకు మార్చి పేకాట ఆడించడం విశేషం. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డుకు చెందిన మాజీ పోలీస్ అధికారి ఒక్కరు తన ఇంటిని పేకాట క్లబ్ గా మార్చి ఆడిస్తుండగా అతడి సన్నిహితులైన పొలీసుల సహకారంతో పత్తాలాటను ఘనంగా నిర్వహిస్తున్నారు. బోర్గాంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, మరో బిల్డర్ కలిసి మొన్నటికి మొన్న ఒక బట్టల షాపింగ్ మాల్ లో పత్తాలాడిస్తు దొరికిన ఇంకా నిర్వహణ మాత్రం ఆగలేదు. వారికి ఒక మూర్తి అనే నామధేయుడు తోడు కాగా తెలంగాణ శ్రీనివాసుని ఆశీస్సులతో జూదం శివారు ప్రాంతాలకు తరలింది. పోలీసులకు పత్తాలాటలో దొరికిన దోస్తానాతో పత్తాలాట కొనసాగిస్తున్నారు. ఇటీవల మహరాష్ట్రలోని రాత్రిపూట పేకాట క్లబ్ పై అక్కడ పేకాట అడుతు 40 మంది ఉమ్మడి జిల్లా ఘనులు పట్టుబడ్డారు. దాని నిర్వహకులు కామారెడ్డి జిల్లా పిట్లం కు చెందిన వారు కావడం విశేషం. అక్కడ ఐనా పత్తాలాటపై జరిగిన రైడ్ కు భాధ్యతలను తీసుకుని వారిని విడిపించడం గమనార్హం. ప్రస్తుతం పత్తాలాట లో వర్ని మండలంలోని ఒక గ్రామం నుంచి ఆర్గనైజర్ గా చేస్తున్న నిర్వాహకుడు తన సామాజ్రాన్ని విస్తరించడం లో బిజీగా ఉన్నారు. పోలీసుల రైడ్ సమాచారం ముదురులకు ముందే లీక్ అనే అపవాదు ఉంది. అందుకే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి బైండోవర్ చేస్తామని షీట్ లు ఒపేన్ చేస్తామని పోలీసులు బెదిరించిన ఆర్గనైజర్ లు మాత్రం పత్తాలాటను వీడటం లేదు.
