28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం తీసుకొచ్చారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్  అన్నారు. ఆదివారం రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి, రాణంపల్లి గ్రామాలల్లో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో “జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బి అంబేద్కర్ చిత్రపటాలు, రాజ్యాంగం చేతపుని  గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని వారి చేతుల్లో దేశం వెళ్లితే మన బతుకులు భద్రంగా ఉంటాయా మీరే ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, ఏఎంసి  డైరెక్టర్ షేక్ మహబూబ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నితిన్ పటేల్, చిక్కడపల్లి గ్రామ అధ్యక్షులు దువ్వ రవి, రాణంపల్లి గ్రామ అధ్యక్షులు మేత్రి చంటి, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, మాజీ ఎంపీటీసీ షేక్ గౌస్,నేరుగంటి బాలరాజు,షేక్ నీస్సార్, డాక్టర్ రఫీ ఖద్రి,కుర్మాజీ సాయిలు, మాడ నాగనాథ్, వేముల రమేష్, మోహన్,బేగరి భూమయ్య, సుదర్శన్ గౌడ్, తెలగాడం అరుణ్, గాండ్ల రమేష్, కర్రోళ్ల సత్యం తదితరులు  పాల్గొన్నారు.

More articles

Latest article