జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమం
రుద్రూర్, బతుకమ్మ : ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం తీసుకొచ్చారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి, రాణంపల్లి గ్రామాలల్లో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో “జై బాపు - జై భీమ్ - జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహాత్మా...