అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఎదిగింది అంటే ఎందరో మహనీయుల జీవితాల త్యాగ ఫలం అని అన్నారు. వారి ఆశయాలను సాధిద్దామన్నారు. 2 సీట్లతో బీజేపీ ప్రస్థానం మొదలై ఈ రోజు మూడో సారి ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు వరకు ఎదిగిందన్నారు. వికాసిత్ భారత్ కోసం అందరం పని చేద్దామని పిలుపునిచ్చారు.. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
