30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత కమ్యూనిస్టు పార్టీ- సిపిఐ ఆధ్వర్యంలో స్వర్గీయ బాబు జగ్జీవన్ రాం 118 వ జయంతి సందర్భంగా రైల్వే కమాన్ వద్ద గల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 30 సంవత్సరాల పాటు రాష్ట్ర,కేంద్ర శాఖల్లో మంత్రిగా పని చేశారని దేశ చరిత్రలో ఎక్కువ కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన ఘనత ఆయనకే చెల్లుతుందని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి పునాది వేశారని అన్నారు. ఇది భారత వ్యవసాయం యొక్క ఆధునికరణకు గణనీయంగా దోహదపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య, సిపిఐ జిల్లా నాయకులు పి.రంజిత్, బి.రఘురాం, పి.హనుమాన్లు, అంజలి పాల్గొన్నారు.

More articles

Latest article