27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఫస్ట్ క్లాస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  • పని తీరు భేష్ అన్న పీపుల్స్ పల్స్ సర్వే
  • పనితీరులో 5 వ స్థానంలో నిలిచిన బాల్కొండ ఎమ్మెల్యే

 

భీమ్ గల్, బతుకమ్మ : బీయర్ఎస్ అధికారం ఉన్న గత పది సంవత్సరాలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి, పనితీరును రాష్ట్ర ప్రజలంతా బాల్కొండ వైపు చూసే విధంగా పని చేసిన మాట ప్రజలందరికీ విధితమే. కాగా ఇటీవలే పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ రాష్ట్రంలోని 118 కాంస్టెన్సీల్లో నిర్వహించిన సర్వేలో ప్రశాంత్ రెడ్డి పని తీరు 5వ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, రెండవ స్థానంలో గజ్వేల్ మాజీ సీ. ఎం కేసీఆర్, మూడవ స్థానంలో మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు, నాలుగో స్థానంలో చంద్రయాన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిలువగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఐదవ స్థానంలో ఉన్నారు. సర్వేలో ప్రశాంత్ రెడ్డి పని తీరు బాగుందని ప్రజలు సర్వేలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గా, మంత్రి గా ఇటు జిల్లాకు అటు తన కానిస్టేన్సీకి కావాల్సిన పనులను ప్రజల కోరిక మేరకు ప్రణాళిక బద్దంగా తన అనుభవంను రంగరించి, అధికారులతో గ్రూప్ డిస్కషన్స్ చేసి,ఎస్టిమేట్ లు చేయించుకొని నిధులను తీసుకొచ్చి  అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రాష్ట్ర మంత్రిగా, అప్పటి సీ. ఎం కేసీఆర్ కు దగ్గరగా ఉంటూ బిజీగా ఉన్నప్పటికీ మంజూరు చేయించిన పనులన్నింటి తన జిల్లా, కానిస్టేన్సీ పర్యటనల్లో భాగంగా పనులను పర్యవేక్షించి,వినూత్న రీతిలో పూర్తి చేయించారు.వేల్పూర్ మండలంలో వేల్పూర్ పెద్దవాగు, మోతె కప్పల వాగుల పై వంతెనల నిర్మాణం పనులను మూడున్నర నెలల కాలంలో పూర్తి చేయించి చరిత్ర సృష్టించారు. అంతే కాకుండా పార్టీ పనుల్లో పూర్తి భాద్యత యుతంగా ఉంటూ పార్టీ పెద్దగా ఉమ్మడి జిల్లాల్లో పార్టీ ప్రతిష్టత కోసం కష్టపడుతున్న, కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీని నిలబెట్టడానికి ప్రశాంత్ రెడ్డి పని చేస్తున్నారు.

First Class MLA Prashanth Reddy

More articles

Latest article