25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మౌలిక సదుపాయ కల్పనకు పిఆర్టియు ముందంజ

Must read

📰 Generate e-Paper Clip

  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

 

బతుకమ్మ, పిట్లం : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయ కల్పన కొరకు పిఆర్టియు కృషి చేసిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పిఆర్టి రాష్ట్ర అధ్యక్షుడు గుండుమోహన్ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వల చేశారు. అభినందన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్ గారి అభినందన ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గుండు లక్ష్మణ్ ను శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూనే అంచెలంచెలుగా ఎదిగి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

PRTU takes the lead in creating infrastructure

భవిష్యత్తులో వారు మరింత ఎత్తుకు ఎదగాలని, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనది సంగారెడ్డి జిల్లాలో జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర పీఆర్టీయూ అధ్యక్షుడిగా ఎదిగిన లక్ష్మణ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. పద్యాల సమస్యలు 20 సంవత్సరాలుగా పిఆర్టియు సంఘంలో పనిచేసే రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ఉచితంగా హెల్త్ కార్డులను ప్రభుత్వం చేత ఈ ఇప్పించే విధంగా ఇద్దరం కలిసి పని చేస్తామని ఎమ్మెల్సీ అన్నారు. అభినందసభను సాయి గ్రూప్ పిట్లం నిర్వహించడం అతని స్నేహభావంతో సాయి గ్రూప్ వారికి అభినందించారు. సాయి గ్రూప్ సభ్యులు మరెన్నో ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందుండి ముందున్న ఎండాకాలంలో తాగునీటి ఏదడి రాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ రెడ్డి, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, పిట్లం సాయి గ్రూప్ సభ్యులు సంజీవరెడ్డి, దయానంద్  రమేష్, విశ్వనాథం, దుబాయ్ రాజు, బన్సీలాల్, పిట్లం శాఖ పిఆర్టియు నాయకులు జిల్లా వ్యాప్తంగా  పిఆర్టి నాయకులు అధ్యక్షులు పాల్గొన్నారు.

PRTU takes the lead in creating infrastructure

More articles

Latest article