25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐ ఎఫ్ టి యు మహాసభలను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ : ఐఎఫ్టియు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయండని జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ కార్మికులకు ప్రజలకు పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు 8 వ ఆల్ ఇండియ మహాసభల కరపత్రాలను ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వాలు ఏర్పడిన శ్రమజీవుల కలిగే ప్రయోజనం శూన్యం అని ప్రతిరోజు పొట్ట కూటికోసం శ్రమించాలి రోజుకు మూడు పూటలు తిండి లేక ప్రజలు దేశంలో 44 కోట్ల మంది ఉన్నారని అన్నారు.  దేశాన్నిఅమ్మితే కొనగలిగే సంపన్నులు మన దేశంలోనే ఉన్నారు అని బడా పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని దేశ వనరులను అప్పగించే చట్టాలు చేసి కార్పొరేట్ ప్రయోజనాలు ముఖ్యమైనట్లుగా పాలకుల విధానాలు ఉన్నాయని అన్నారు.  ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టర్ గా అవుట్సోర్సింగ్ పని చేస్తున్న కార్మికులకు పర్మిట్ చేయాలని మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులు వల శ్రమ దోపిడీ గురవుతున్నారని వారికి వేతనం 18000 వేలు నుంచి 26,000 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు వల రక్తాన్ని ధారబోసి దేశాన్ని నడిపిస్తే ప్రభుత్వాలు కార్పోటు శక్తులకు భారతదేశాన్ని అంబానీ ఆదాని సామ్రాజ్యవాద శక్తులకు తాకట్టు పెడుతున్నారని అన్నారు. ఆటో కార్మికులకు నెలకు ప్రభుత్వం 12000 రూపాయలు ఇవ్వాలని వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 2 తేదీ పూణే లో మహారాష్ట్ర రాష్ట్రంలో జరుగు ఐఎఫ్ యు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్ సింగ్, నవీన్, రామకృష్ణ, కృష్ణంరాజు, సంపత్, ప్రశాంత్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article