27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వేల్పూరు పాఠశాలకు ఉన్నతమైన చరిత్ర ఉంది

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

బతుకమ్మ, వేల్పూర్ :- వేల్పుర్ ఉన్నత పాఠశాలకు ఉన్నతమైన చరిత్ర ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.  వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేల్పూరు పాఠశాలకు ఉన్నతమైన చరిత్ర ఉందని అన్నారు. ఎందరో మేధావులను తయారుచేసి సమాజానికి అందించింది ఈ పాఠశాల నా విద్యాభ్యాసం ఈ పాఠశాల నుండి మొదలైంది అన్నారు. మైపాల్ రెడ్డి, డి శ్రీనివాస్, నన్ను ఈ రాష్ట్రానికి మంత్రులుగా అందించిందని తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకుని అనేక హోదాలో పనిచేసిన అన్నపూర్ణమ్మ, ఎమ్మెల్యేగా రమేష్ రెడ్డి డిసిసిపి చైర్మన్ అంతర్జాతీయ స్థాయి కీళ్లకారులు ఉన్నత విద్యాశాఖ మండల చైర్మన్ లింబద్రి సాయన్న ఇలా ఎందరును ఈ పాఠశాల తయారు చేసిందని అన్నారు. ఒక విద్య మాత్రమే మనకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఆస్తులు కరిగిపోతాయి కానీ నేర్చుకున్న జ్ఞానం మనకు ఊపిరి ఉన్నంతవరకు ఉపయోగపడుతుందని వారు అన్నారు. నేను చదివిన ఇంజనీరింగ్ చదువు వల్లనే కేసిఆర్ నన్ను పిలిచి ఎమ్మెల్యేగా చదివిన చదువు ఆధారంగా ఆర్ ఎండ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు అన్నారు.

More articles

Latest article