నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని గిరిరాజ్ కళాశాల ఎన్ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రూరల్ మండలంలోని ఆకుల కొండూర్ లో ప్రత్యేక శిబిరం కొనసాగుతోంది. రెండో రోజైన శుక్రవారం గ్రామశివారులోని వైకుంట ధామంలో పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శ్రమదానం చేశారు. ప్లాస్టిక్ వాడకం కారణంగా తలెత్తే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. జ్యుట్ బ్యాగులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొగ్రాం అధికారి ఇ వెంకటరమణ, వీడీసీ సభ్యులు గణేశ్, సుమన్, భోజన్న, దేవదాస్, మాజీ సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

