27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ ఏఈఈ

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : పటాన్ చెరు  నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ పరిధిలో గుమ్మడిదల ఏఈఈగా పనిచేస్తున్న రవికిషోర్ ఏసీబీకి చిక్కాడు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఇరిగేషన్ ఎన్వోసీ పొందేందుకు సంతోష్ అనే వ్యక్తి ఏఈఈ రవికిషోర్ ను సంప్రదించాడు. నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు రవికిషోర్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పటాన్ చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈఈ రవికిషోర్ కు బాధితుడు రూ.లక్ష లంచం ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. రవికిషోర్ నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article