27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జీవదాన్ హైస్కూల్లో ఘనంగా కేజీ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి జీవదాన్ హై స్కూల్లో ప్రైమరీ విభాగంలో జీవదాన్ ఇన్ఫంటి అ ప్రైమరీ, కేజీ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కిండర్‌ గార్డెన్‌ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులు నల్లనికోటు, టోపీ ధరించి కేజీ పట్టాలను అందుకోవడానికి వేదిక పైకి రాగానే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చప్పట్లతో స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా హాజరైన అర్డీఓ మన్నే ప్రభాకర్, సీఎంఐ సోసైటీ అధ్యక్షులు పీయూస్ అలెక్స్, విశిష్ట అతిధి సీఎంఐ కౌన్సిలర్ జైక్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మహేష్, పాఠశాల ప్రిన్సిపాల్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ జోబీష్ ఫాదర్,మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల

KG graduation celebrations at Jeevadan High School

అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు సుజిత్, మాజీ మార్కెట్ కమిటీ  వెంకట్ రాంరెడ్డిలు చిన్నారులకు పట్టాలు అందజేశారు.ఈ సందర్భంగా అర్డీఓ మన్నే ప్రభాకర్  మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ముఖ్యమన్నారు.విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అర్డీఓ మన్నే ప్రభాకర్, సీఎంఐ సోసైటీ అధ్యక్షులు పీయూస్ అలెక్స్, విశిష్ట అతిధి సీఎంఐ కౌన్సిలర్ జైక్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మహేష్, పాఠశాల ప్రిన్సిపాల్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ జోబీష్ ఫాదర్,మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు సుజిత్, మాజీ మార్కెట్ కమిటీ  వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KG graduation celebrations at Jeevadan High School

More articles

Latest article