29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నాణ్యత కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ప్రస్తుత రబీ సీజన్ లో రైతులు పండించిన నాణ్యత కలిగిన వరి ధాన్యాన్నే  సేకరించాలని తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. మండలంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనుగోలు చేయనున్న వరి ధాన్యం కొనుగోళ్ల పై ఐకెపి సీసీలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, వివోఏ లకు వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ  ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లుల ద్వారా ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ మాట్లాడుతూ వర్ధాన్యం కొనుగోలు లో సన్న రకం ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే తూకం చేయాలని సూచించారు. దొడ్డు రకం వరి ధాన్యానికి క్వింటాల్ కు 2350 రూపాయలు, సన్న రకం వరి ధాన్యానికి 2300 ల రూపాయలు, 500 రూపాయలు బోనస్ ను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వరి ధాన్యంలో తాలు, మట్టి, రాళ్లు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలన్నారు. మండల మహిళా సమాఖ్య ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లలో అనుభవమున్న లింగంపేట మండల సిసి ఎండి.నజీర్ పాల్గొని వరి ధాన్యం కొనుగోళ్లలో‌ వచ్చే ఇబ్బందులు పరిష్కార మార్గాల గురించి, అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ధాన్యం కొనుగోళ్ల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బెస్త శాంత, ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, సీసీలు నారాయణ, రమేష్, దత్తు, సుజాత, రషీద్, 11 గ్రామ సంఘాల కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article