25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : భారతీయ జనతాపార్టీ బోర్గాం (పి) 5 వ డివిజన్ ఆధ్వర్యంలో  సన్న బియ్యం పథకం పై వినియోగదారులకు నిజ నిజాలని తెలియజేశామని చేయడం బీజేపీ యువ నాయకులు దండు శ్రీకాంత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నెలకు సన్న బియ్యం పథకం కొరకై 10 వేల కోట్లు వెచ్చిస్తుందని అన్నారు.  అలాగే రేషన్ వినియోగదారులకు  ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తే కేంద్రమే అందులో 5 కిలోలు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఒక కిలో బియ్యం ఇస్తూ ప్రారంభోత్సవం చేయడం సిగ్గు చేటని అన్నారు. సొమ్ము ఒక్కరిదీ సోకు ఒక్కరిదీ అన్న చందంగా కాంగ్రెస్ వైఖరి ఉందని  ఎద్దేవా చేశారు. ప్రజలందరూ వీటన్నిటినీ గమనించి రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, కార్పొరేషన్ ఎలక్షన్లలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతాపార్టీ గెలిస్తేనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం  మాజీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు తోట శాస్త్రి, తొపారం భాస్కర్, మీరుదొడ్డి శివశంకర్, రచ్చ ఆనంద్, కల్లేడ భాస్కర్, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ యువ నాయకులు బంటు నిఖిల్, రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Distribution of rice to beneficiaries

More articles

Latest article