27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డయల్ 100 మిస్ యూజ్ చేసిన వ్యక్తికి 3 రోజుల జైలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : ప్రజలు అపత్కాలంలో అదుకునేందుకు ఉద్ధేశించిన డయల్ 100 ను మిస్ యూస్ చేసిన వ్యక్తికి న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించింది. నిజామాబాద్ నగర నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని నాలగవ టౌన్ పరిధిలోని గాయత్రి నగర్ కు చెందిన కావేటి నారాయణ నిత్యం మద్యం సేవించి స్థానికంగా న్యూసెన్స్ చేసేవారు. అంతే గాకుండా డయల్ 100 కు పదే పదే కాల్ చేసి మీస్ యుస్ చేయడంతో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పేట్టారు. అతనికి సెకండ్ క్లాస్ మేజిస్ర్టేట్ 3 రోజుల సాధరణ జైలు శిక్ష విధిస్తు తీర్పు వెలువరించారు.

3 days jail for dial 100 misuser

More articles

Latest article