24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :మండలం లోని అన్నసాగర్ గ్రామంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నసాగార్ గ్రామ అధ్యక్షులు క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమం కోసం పాటు పడే పార్టీ అని అందులో భాగంగా తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం ఇవ్వటం దేశంలో నే మొట్ట మొదటి రాష్ట్రం అని అన్నారు.ఈ పథకానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల,నాయకుల ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, క్యాషియర్ కాశీరం యాదవ్, గ్రామ ఉపాధ్యక్షులు భీమయ్య, గురు ప్రతాప్, రామగౌడ్,అశోక్ రెడ్డి, హైమద్ హుస్సెన్,సాయిబాబా, సాయగౌడ్, హైమాద్ పాష తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article