24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి తో కలిసి నగరంలోని సన్న బియ్యం పంపిణీని కేశ వేణు ప్రారంభించారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం హర్షణీయమని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నగర కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రత్నాకర్, రామర్తి గోపి, రాజేశ్, అరుణ్, రమేశ్, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Distribution of rice as promised

More articles

Latest article