26.6 C
Hyderabad
Monday, August 3, 2026

విశ్వకర్మ సంఘ అధ్యక్షులు గా మంద భూమేశ్వర్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ విశ్వకర్మ సంఘం ( 2 ) నూతన అధ్యక్షునిగా మంద భూమేశ్వర్ ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో నూతన కార్యవర్గన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో ఉపాధ్యక్షులుగా కత్రజీ బుచ్చన్న, కోశాధికారిగా రాగుల గంగాధర్, కొలకాడుగా ఘనపూర్ నరేందర్ సలహాదారులుగా గజ్జల మోహన్, రాగుల ఓంకార్, జమిలిగిరి ముత్తన్న, రావుట్ల సతీష్, కోటగిరి హరి లను ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గం ఉగాది నుండి 2026 ఉగాది వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధి కొరకు పాటు పడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article