ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఈనెల పదవీ విరమణ పొందుతున్న ఎల్లారెడ్డి ఎంఈఓ-వెంకటేశంను ఎంపీడిఓ ప్రకాష్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల నుంచి హాజరైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు ఎంఈఓ సేవలను కొనియాడారు. ఎంపీడిఓ ప్రకాష్ మాట్లాడుతూ 15 సంవత్సరాల పాటు మాతో అందరు ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుంటూ మండలంలోని విద్యా పురోభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. జిల్లాలోనే ఎల్లారెడ్డి మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎంఈఓకి దక్కుతుంది అని ప్రశంసించారు. ఎంఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. తన సుదీర్ఘ ఎంఈఓ ప్రస్థానంలో సహకరించిన ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల ఎమ్మార్సీ సిబ్బంది అందరికీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ఓ ఎల్.రాజులు, ఉపాధ్యాయ సంఘనాయకులు పి.శ్రీనివాస్, వినయ్ కుమార్, ఎం.వెంకటయ్య, ఎండీ.ముజీబోద్దిన్, బి.ఆంజనేయులు, కె.దాసిరామ్; ఎన్.నాగరాజు; పి.అనిల్;బి. లక్ష్మణ్, షాకీర్, ఎన్.విజయ్ తదితరులు పాల్గొన్నారు.
