- ఐక్యపోరాటాలతో మతోన్మాదాన్ని పాతరేద్దాం
- సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ మెంబర్ కేజీ. రాంచందర్
భీమ్ గల్, బతుకమ్మ : ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేంద్రం లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మత ఘర్షనలను సృష్టిస్తోందని సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ సెక్రటేరియేట్ మెంబర్ కే. జీ. రాంచందర్ ఆరోపించారు.శుక్రవారం మండలంలోని గంగారాయి గ్రామంలో నిర్వహించిన నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లాల సంయుక్త కమిటీల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.బీ జీపీ గ్రామీణ ప్రాంతాల్లో సైతం మత ఉద్రిక్తతలను పెంచి పోషిస్తోందని అన్నారు. కేంద్ర పభుత్వ పరిపాలన తీరు దేశ ఉన్నతిని దిగధర్చుతుందని, తద్వారా దేశంలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరిగిపోతున్న స్పందనలేకపోగా, ధరలు చుక్కలను అంటుతున్న ప్రజలను పట్టించుకొన్న పాపన పోవడంలేదన్నారు. సీపీఐ(ఎం.ఎల్.)మాస్.లైన్ రాష్ట్రసెక్రటేరియట్ మెంబర్ కట్ట రమ మాట్లాడుతు ప్రజల సమస్యలను పాలక వర్గాలు విస్మరిస్తున్నాయని, ప్రజలు ఎదురకొంటున్న సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తు విప్లవొద్యమాల నిర్మాణంకు పూనుకోవాలి అన్నారు. కమ్యూనిస్ట్ లు ప్రజల్లో మమేకం అయి ఉద్యమాల నిర్మాణంకు పూనుకోవలి అన్నారు.
జనరల్ బాడికి ముందు అమరులను స్మరిస్తు రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకొన్నారు. జనరల్ బాడీ సమావేశంలో పార్టీ సెక్రటేరియట్ మెంబర్ వి. ప్రభాకర్, రాష్ట్రా నాయకులు పి. రామకృష్ణ, పార్టీ జిల్లా నాయకులు బి. దేవరాం, ఎం. ముత్తెన్న, ఎస్. సురేష్, ఆర్. రమేష్, జి. కిషన్, కే. రాజేశ్వర్, ఎం. పరమేష్, ప్రకాష్, సురేష్, పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్,బి. కిషన్, బి. బాబన్న, పి. రమ, జి.సాయిరెడ్డి, మండలాల నాయకులు ఈ. రమేష్, బి.కిశోర్, ఎం. లింబాద్రి,ఎస్. కిశోర్, జి. రాంజి తదితరులు పాల్గొన్నారు.

