29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని నార్త్ రూరల్ సర్కిల్ కార్యాలయం, టౌన్ 5  పోలీస్ స్టేషనులను పోలీస్ కమీషనర్ సాయి చైతన్య గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లను మొత్తం కలియతిరిగి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్  పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.  ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.

CP Sai Chaitanya inspected police stations

రౌడీ షీటర్ లను ప్రతీ రోజు వారి దిన చర్యను గ్రహించి వారు మళ్ళీ ఎలాంటి నేరాలు చేయకుండా తగు చర్యతీసుకోవాలని, వారి ఆగడలను పూర్తి గా నియంత్రించాలని తెలిపారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎవరయిన గంజాయికి బానిస అయితే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు.

CP Sai Chaitanya inspected police stations

దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాదు నార్త్ రూరల్ సీఐ  బి. శ్రీనివాస్ , టౌన్ 5 ఎస్ఐ ఎమ్. గంగాధర్  పాల్గొన్నారు.

CP Sai Chaitanya inspected police stations

More articles

Latest article