27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విలీన సభ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు జెండాను ఆవిష్కరించారు. నిజాంబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రంలో గురువారం ఘనపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి విలీన సభ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు శివ బాబు ల అధ్యక్షతన నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతు కార్మికులు సమ్మె చేస్తే, కెసిఆర్ నమ్మించి మోసం చేశారని తెలిపారు.  రేవంత్ రెడ్డి అయిన ఇచ్చిన మాట ప్రకారం కార్మికులను పర్మనెంట్ చేసి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు మరణ శాసనం విధిస్తోందని అన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్లో అగ్ర భాగాన ఉంది పని చేస్తున్న సఫాయి కార్మికులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అబ్దుల్, సొప్పరిగంగాధర్, కార్తీక్, నర్సిరెడ్డి, సామెల్, దాల్మల్కి పోశెట్టి, ప్రజా సంఘాల నాయకులు సాయిరెడ్డి, శివకుమార్, మోపాల్ నరసయ్య, రంజిత్,తదితరులు పాల్గొన్నారు.

Workers should be made permanent immediately.

More articles

Latest article