కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి
ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విలీన సభ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు జెండాను ఆవిష్కరించారు. నిజాంబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రంలో గురువారం ఘనపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి విలీన సభ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు...