27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఈసారి రాస్తే క్రిమినల్ కేసు పెడతా

Must read

📰 Generate e-Paper Clip

  • విజయ డెయిరీ లో ఓ అధికారి నిర్వాకం
  • ఏరి కోరి తెచ్చిన బోధన్ ఎమ్మెల్యే, చైర్మెన్
  • పని చేతగాక తరచుగా సెలవులో..
  • ‘బతుకమ్మ’లో వరుస కథనాలతో హైరానా    
  • సరిదిద్దడం చేతగాకనే నోటి వెంట కేసులు

నిజామాబాద్, బతుకమ్మ:  నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది విజయ డెయిరీ అధికారి వ్యవహారం. కింది స్థాయిలో జరుగుతున్నది తెలుసుకోకుండా చెప్పుడు మాటలు వింటూ ప్రతికారేచ్చను మదిలో రగిలింపజేసుకుంటున్నారు. ప్రభుత్వామోదిత  సంస్థ అయినా విజయ డెయిరీలో జరుగుతున్న అక్రమాలను, లోపాలను బతుకమ్మ వరుస కథనాలను వెలువరించింది. దీనికి గాను పని చేయాలన్న తపన ఉన్న అధికారి సంస్కరించాల్సింది పోయి డెయిరీని కుచేల స్థితికి తీసుకెళ్తున్న వారికి వంత పాడుతున్నారనే చర్చ జరుగుతోంది.

  • ఏరికోరి బోధన్ ఎమ్మెల్యే తెస్తే ..

విజయ డెయిరీని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సంస్థ చైర్మెన్ అమిత్ రెడ్డి తహతహ లాడుతున్నారు. దీనిలో బాగంగానే ఇక్కడ పని చేసిన అనుభవం ఉన్నందున ఆగష్టులో జరిగిన బదిలీలలో ఆ ఆదికారిని నిజామాబాద్ మిల్క్ షెడ్ కు రప్పించారు. డెయిరీలో నెలకొన్న లోటుపాట్లను సరిదిద్ది పాల సేకరణను పెంచడంతో పాటు, పాల పదార్థాలను వినియోగదారులకోసం ఉంచుతారని జిల్లా వాసులు అభిప్రాయానికి వచ్చారు. ఆశలు అడియాసలైనట్లు పాల సేకరణ పెరగడం కంటే ఉన్నవి తగ్గడంతో పక్క జిల్లా నుంచి అడుక్కుంటున్నారు. పాలు తగ్గుతున్నాయని గ్రహించి, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా సంస్థను దిగజార్చుతున్నసిబ్బంది వైపే మొగ్గు చూపడం చూస్తే ఇక్కడ ఇంకొన్ని రోజుల కంటే ఎక్కువ ఉండక పోవచ్చనే ఊహాగానాలు వినబడుతున్నాయి.

  • తరచుగా సెలవులో..

నిజామాబాద్ మిల్క్ షెడ్ కు వచ్చి ఏడాది  కావట్లేదు గాని, రెండు మార్లు నెలల తరబడి సెలవులో వెళ్ళిపోయారనే చర్చ మొదలయ్యింది. చేసిన ఆ రోజుల్లోనైనా ప్లాంట్ ను  తనిఖీ చేయడం గాని, సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం లాంటివి జరగిన దాఖలాలు లేవని డెయిరీ సిబ్బందే చర్చించుకుంటున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న అధికారి పర దేశానికి వెళ్ళారు. సెలవు పొడగించాలని అక్కడి నుంచి ఉన్నతాధికారులకు విన్నవించుకోగా, విదుల్లో చేరాలని స్పష్టమైన సంకేతాలు వెళ్ళడంతో చేసేదిలేక తిరుగు పయనమై, ఆరోగ్యం సహకరించడం లేదని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని మొరపెట్టుకున్నట్లు సమాచారం. ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో చేసేదిలేక నిజామాబాద్ మిల్క్ షెడ్ కు వచ్చేశారు. విరమణ ముందు జరగరానిది జరిగితే, వచ్చే సౌకర్యాలకు (బెనిఫిట్స్) విఘాతం ఏర్పడనుందనే భయాందోళన ఆ అధికారి మోములో కదలాడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా క్రిమినల్ కేసులని బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

  •   బతుకమ్మ కథనాలతో..

విజయ డెయిరీలో జరుగుతున్న అక్రమాలను వరుస కథనాల పరంగా ‘బతుకమ్మ’ వెలుగు లోకి తెచ్చింది. పాలు తగ్గడం, నాణ్యత లేకపోవడం, సిబ్బంది సరైన  సమయానికి విధులకు రాకపోవడం, టిప్ లో జరుగుతున్న మోసపూరిత అక్రమాలపై ప్రచురణలు గావించింది. షెడ్ లో జరుగుతున్నదానిపై విచారణ గావించి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం పై స్థాయి  అధికారికి  ఉంటుంది. ఇక్కడ భిన్నంగా తయారయింది. కింది స్థాయి ఉద్యోగి చెప్పింది విని, ఆ మాటలనే వేదంగా పరిగణించుకుంటున్నారనే ప్రచారం డెయిరీలో జరుగుతోంది. ఎలా అంటే డెయిరీలోని లోపాల గురించి వార్తలు రాస్తున్న బతుకమ్మపై క్రిమినల్ కేసులు పెట్టించాలనే దిశగా ఆ అధికారిని తీసుకెళ్తుంటే, చెప్పేవారికి లేకపోయినా, వినేవారికి ఉండాలిగా అనే మాటలు వినబడుతున్నాయి. చెప్పుడు మాటలు విని బతుకమ్మపై క్రిమినల్ కేసు పెడతారా.. డెయిరీలోని పని దొంగలపై చర్యలు తీసుకొని సంస్థను సంస్కరిస్తారా.. వేచి చూడాలి.

More articles

Latest article