29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం

Must read

📰 Generate e-Paper Clip

  • ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎవరైనా శాంతి భద్రతలకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా, మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టుల పెట్టిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకటర్ రెడ్డి తెలిపారు. ఐదో టౌన్ ఎస్ఐపై సోషల్ మీడియాలో వస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.  సోషల్ మీడియాలో నగర ఐదవ టౌన్ ఎస్‌ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రసూల్ అనే రౌడీ షీటర్ వివరాలు ఏసి‌‌పి నిజామాబాద్ డివిజన్ బుధవారం వెల్లడించారు. రసూల్ అనే రౌడీ షీటర్ ను మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై  దాడి చేసిన కేసులో గతంలో అరెస్ట్ చేశామని తెలిపారు. రెండు నెలల క్రితం రసూల్ కు సత్ప్రవర్తన కింద కండిషనల్ బెయిల్ ను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మంజూరు చేశారు. సత్ప్రవర్తన కౌన్సిలింగ్ లో భాగంగా నిందితుడిని పోలీస్ స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసుల పట్ల వ్యతిరేక భావంతో ఉండడంతో  సోషల్ మీడియాలో ఐదో టౌన్ ఎస్ఐపై మానసికంగా, వేధిస్తున్నాడని ఎన్ కౌంటర్ చేయాలని చెప్పి కోపంతో బెదిరిస్తూ మరుసటి రోజు నెహ్రూ పార్క్ వద్దకు వచ్చి ఎన్ కౌంటర్ చేయాలని సవాల్ విసిరాడు. మరుసటి రోజు నెహ్రూ పార్క్ వద్దకు వచ్చి మళ్లీ వీడియో పోస్ట్ చేశాడు. ఈ విషయం పై ఎస్సై ని బెదిరిస్తూ, సవాల్ విసిరుతూ పోలీసుల యొక్క విధులను  ఆటంక పరుస్తూ, పోలీసుల మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇతనిపై కేసు నమోదు కొరకు  కోర్టుకు అనుమతి కోరారు. అదేవిధంగా నిందితుడు కండిషన్ బెయిల్ పైన విడుదలైనాడు ఈ కండిషన్ బెయిల్ లో ఉన్న షరతులని ఉల్లంగించి సాక్షులని బెదిరించడం అలాగే  సోషల్ మీడియాలో రెచ్చ గొట్టే విధంగా బెదిరింపులకు పాల్పడినటువంటి పోస్టులు పెడుతున్నాడు కాబట్టి ఇతని బెయిల్ క్యాన్సిలేషన్ కోసం కోర్టుకు లెటర్ పెట్టాం.నిందితుడిని సత్ప్రవర్తన నిమిత్తం ఐదు లక్షల కొరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద  బైండోవర్ చేయడం జరిగింది.   నిందితుడు అట్టి షరతులను అతిక్రమించి పోలీసులపై సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్  చేసిన నేపథ్యంలో  ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కి అట్టి అయిదు లక్షల రూపాయాలని జప్తు చేయడం కొరకు రిక్వెషన్ లెటర్ పంపాం. ఈ క్రమంలో శాంతిభద్రతలకి  భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యక్తులు సోషల్ మీడియా లో గాని,  ఇంకా ఎక్కడైనా గాని ఏమైనా అసభ్యకరమైన లేదా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టారీత్యా చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article