. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 1వరకు..
. 2వ తేదీ నుంచి యథావిధిగా కొనుగోళ్లు
నిజామాబాద్, బతుకమ్మ: ఆర్థిక సంవత్సరం (2024 – 25) ముగింపు నేపథ్యంలో నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వరుసు సెలవులు ప్రకటించినట్లు ఏఎంసీ కార్యదర్శి తెలిపారు. ఆర్థిక సంవత్సరం వ్యాపార ముగింపు లెక్కల సందర్భంగా ఈనెల 28వ తేదీన ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరగడవని, అలాగే 29న అమావాస్య, 30న ఆదివారం, 31, ఏప్రిల్ 1న రంజాన్ సందర్భంగా మార్కెట్ యార్డుకు సెలవులు ఉంటాయని వివరించారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
మార్కెట్ యార్డుకు వరుస సెలవులు
