27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

144 సెక్షన్ పరిధిలో జోరుగా మైక్రో జిరాక్స్ లు..!

Must read

📰 Generate e-Paper Clip

– నిబంధనలను ఉల్లంఘిస్తున్న జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు
– కోటగిరిలో జిరాక్స్ సెంటర్ నుంచి ఎస్సెస్సీ విద్యార్థులకు చీటీలు
– ఫొటోలు తీసిన జర్నలిస్ట్ పై దాడికి యత్నం
– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా, అటు గవర్నమెంట్ హైస్కూల్ కు, ఇటు పోలీస్ స్టేషన్ కు వంద మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్ నుంచి విద్యార్థులకు జోరుగా చీటీలు వెళ్తున్నాయి. జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు బహిరంగంగానే పాఠ్య పుస్తకాల్లో నుంచి జవాబులను మైక్రో జిరాక్స్ చేస్తూ సెంటర్ లోకి పంపిస్తున్నారు.

సమాచారం అందుకున్న జర్నలిస్టులు జిరాక్స్ సెంటర్ కు చేరుకుని ఫొటోలు తీయగా, ఓ జర్నలిస్టుపై దాడికి యత్నించారు. జిరాక్స్ సెంటర్ నుంచి బయటికి వచ్చిన ఓ వ్యక్తి ఎవడురా నువ్వు? ఫొటోలు ఎందుకు తీస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించాడు. మా వాళ్ళు వస్తున్నారు ఆగు.. నీ అంతు చూస్తారు అంటూ రిపోర్టర్ పై బెదిరింపులకు దిగాడు.

అంతా జరిగిన తర్వాత అక్కడికి వచ్చిన జిరాక్స్ సెంటర్ యజమాని సైతం ఫోటో తీసింది నువ్వేనా నీ అంతు చూస్తాను అని బెదిరించాడని రిపోర్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి యత్నించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సదరు జర్నలిస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144సెక్షన్ ను అమలులో ఉంటుంది. 144 సెక్షన్ పరిధిలో జిరాక్స్ సెంటర్లను ఓపెన్ చేయకూడదు అది చట్ట విరుద్ధం. 100 మీటర్లపరిధి బయట ఉన్న జిరాక్స్ సెంటర్లను ఉదయం తొమ్మిదింటికి మూసివేసి మధ్యాహ్నం 12.30గంటల తరువాత తెరువాలని నిబంధనలు ఉన్నాయి.

More articles

Latest article