30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇంటి పన్నులో 90శాతం రాయితీ ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : జీహెచ్ఎంసీ  తరహాలో తెలంగాణలోని అన్ని జిల్లాలు, కార్పొరేషన్లలో ఇంటి పన్నులో 90% రాయితీ ఇవ్వాలని మజ్లిస్ సీనియర్ ఎమ్మెల్యే మాలిక్ పేట్, నిజామాబాద్ మజ్లిస్ ఇంచార్జి అహ్మద్ బిన్ అబ్దుల్లా బిలాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. జీఎంసీ పరిధిలో, తెలంగాణలోని అన్ని ఇతర జిల్లాలు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో కూడా ఆస్తి, ఇంటి పన్ను చెల్లింపులో సౌలభ్యం పొందడానికి 90% రాయితీ డిమాండ్ చేశారు. మజ్లిస్ అసెంబ్లీ సభ్యుడు చేసిన ఈ డిమాండ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అన్ని జిల్లాల ప్రజలు మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, అసెంబ్లీ సభ్యుడు మాలిక్ పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బిలాలాలకు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article